HomeTelugu Trendingచిరంజీవితో కొరటాల సినిమా ఎప్పుడోతెలుసా

చిరంజీవితో కొరటాల సినిమా ఎప్పుడోతెలుసా

9మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల్లో పూర్తి కావొస్తుంది. దీని తరువాత చిరు కొన్ని రోజులు విరామం తీసుకొని కొరటాల శివ సినిమాకు సిద్ధం అవుతున్నాడు. చిరంజీవి కోసం కొరటాల అదిరిపోయే స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, సైరా పూర్తి కాకపోవడంతో ఆలస్యం అయ్యింది.

తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ పుట్టిన రోజైన ఆగష్టు 22 వ తేదీన కొరటాల సినిమా ప్రారంభం అవుతుందట. ఎలాతో ఇంకా రెండు నెలల సమయం ఉన్నది కాబట్టి స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. రైతుల సమస్యలకు సంబంధించిన అంశంతో కథను రెడీ చేశారట శివ. ఇందులో మెగాస్టార్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. ఒకటి రైతు పాత్రకాగా, రెండోది ఎన్ఆర్ఐ పాత్ర. రైతు పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నది. మహర్షి సినిమా మాదిరి రైతుల సమస్యల గురించి కొద్దిగా చూపించి వదిలేయకుండా.. ఆ సమస్యలను డీప్ గా చూపించబోతున్నారు. సెంటిమెంట్, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!