Homeతెలుగు Newsభీమ్లా నాయక్ మిస్... ఇప్పుడు బాలకృష్ణతో ఛాన్స్!

భీమ్లా నాయక్ మిస్… ఇప్పుడు బాలకృష్ణతో ఛాన్స్!

Miss Bhimla Naik... Now a chance with Balakrishna

భీమ్లా నాయక్ రీమేక్ సినిమా. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ యాడ్ చేసిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు త్రివిక్రమ్ చేసిన మార్పులు చేర్పులతో తెలుగులో సినిమా చేశారు. భీమ్లా నాయక్ పేరు వింటే ఎప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ కు పవన్ కళ్యాణ్ పేరు గుర్తొస్తుంది.

పవర్ స్టార్ హీరోగా ఆ రీమేక్ చేద్దామని సితార ఎంటర్టైన్మెంట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ రైట్స్ కొనలేదు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని ‌ప్లాన్ చేసింది. ఎందుకో ఆయనతో వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత రవితేజ, రానాతో ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ మలయాళం సినిమా చూడడం, పోలీస్ రోల్ చేస్తానని చెప్పడంతో సీన్ మొత్తం మారింది. ఇదంతా హిస్టరీ! ఫ్యూచర్ ఏంటంటే… భీమ్లా నాయక్ మిస్ అయినా సరే బాలకృష్ణ సినిమా చేసే ఛాన్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ అందుకుంది.

బాలకృష్ణ హీరోగా బాబి డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా కన్ఫర్మ్ అయింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఆ సినిమా డీటెయిల్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. సంక్రాంతికి బాలకృష్ణ వీర సింహారెడ్డి తో విజయం సాధిస్తే, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తీసిన వాల్తేరు వీరయ్యతో బాబి హిట్ కొట్టాడు. ఇప్పుడు వీర సింహారెడ్డి తో వాల్తేరు వీరయ్య దర్శకుడి కొత్త సినిమా త్వరలో స్టార్ట్ అవుతుంది.

ప్రజెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు బాలయ్య. దాని తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా ఉంటుందని న్యూస్ వినిపించింది. కానీ బోయపాటి కంటే ముందు బాబి సినిమా స్టార్ట్ అవుతుందని టాక్.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!