విష్ణు సరసన మియా జార్జ్!

మంచు విష్ణు హీరోగా ప్రస్తుతం ‘లక్కున్నోడు’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో విష్ణు తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో కార్తీక్ రెడ్డి అనే దర్శకుడు చెప్పిన కథకు విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో ‘అడ్డా’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తీక్ తో సినిమా చేయడానికి విష్ణు అంగీకరించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.

ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా మియా జార్జ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మలయాళం బ్యూటీ ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఉంగరాల రాంబాబు’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే తెలుగులో మరో అవకాశం కొట్టేసింది మియా జార్జ్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.