HomeTelugu Trendingమోహన్‌బాబు న్యూలుక్‌.. చిరు కోసమేనా..!

మోహన్‌బాబు న్యూలుక్‌.. చిరు కోసమేనా..!

5 7
టాలీవుడ్‌ స్టార్‌ హీరో డైలాగ్‌ కింగ్‌.. మోహన్‌బాబు న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ మూవ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో మోహన్‌బాబు కీలకపాత్రలో కనిపించనున్నారని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చాలా ఏళ్ల తర్వాత చిరు-మోహన్‌బాబు కలిసి నటిస్తున్నారా..? లేదా? అనే విషయంపై మాత్రం మూవీయూనిట్‌ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మోహన్‌బాబు న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో విడుదలయ్యాయి. దీంతో చిరు సినిమా కోసమే మోహన్‌బాబు కొత్తలుక్‌తో ఫొటోషూట్‌లో పాల్గొన్నారంటూ టాలీవుడ్‌లో వార్తలు చకర్లు కొడుతున్నాయి. నెటిజన్లు సైతం.. ఆయన లుక్‌ను ప్రశంసిస్తున్నారు. మరికొందరైతే.. చిరు సినిమా కోసం మోహన్‌బాబు సిద్ధమవుతున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమాలో మోహన్‌బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్యకు జంటగా అపర్ణ బాలమురళి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సూర్య నిర్మాతగా 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!