HomeTelugu Big Storiesస్పెయిన్‌లో అక్కినేని ఫ్యామిలీ.. ఫొటోలును పోస్ట్ చేసిన సామ్‌.. వైరల్‌

స్పెయిన్‌లో అక్కినేని ఫ్యామిలీ.. ఫొటోలును పోస్ట్ చేసిన సామ్‌.. వైరల్‌

10 20ప్రముఖ నటి సమంత వరస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి స్పెయిన్ కు బయలుదేరింది. ఈ ఇద్దరు కలిసి చేసిన మజిలీ సినిమా సూపర్ హిట్టైంది. ఆ తరువాత సమంత మెయిన్ లీడ్ రోల్ చేసిన ఓ బేబీ సినిమా అంతకు మించేలా ఉండటంతో.. ఈ జంట ఫుల్ హ్యాపీగా ఉన్నది. ఇద్దరు కలిసి స్పెయిన్ కు బయలుదేరారు. వీరితో పాటు చై.. సామ్ ఫ్రెండ్స్ కూడా వెళ్లారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అఖిల్ కూడా ఈ బ్యాచ్ తో కలిసి స్పెయిన్ వెళ్లడం.

ఎమిరేట్స్ లో ప్రయాణం చేస్తూన్న ఫోటోలను సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అలానే స్పెయిన్ లోని ఇబిజాలో ల్యాండ్ అయినట్టు సమంత సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. వీరంతా ఎందుకు స్పెయిన్ వెళ్లినట్టు.. కేవలం వెకేషన్ ఎంజాయ్ చేయడం కోసమేనా ఏదంటే ఏదైనా విశేషం ఉన్నదా అంటే.. విశేషం ఉందని అంటున్నారు. నాగార్జున 60వ పుట్టినరోజు వేడుకలను ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ లో జరుపుకోబోతున్నారు. ఈ వేడుకలకు చై.. సామ్.. అఖిల్ లు స్పెయిన్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రకుల్ ఇబిజాలోనే ఉన్నది. నాగ్ బర్త్ డే వేడుకల్లో ఆమె కూడా పాల్గొంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!