బిగ్‌బాస్‌-4స్టేజ్‌పై నాగ్‌ చైతన్య!


తెలుగు బిగ్‌బాస్-4 పదోవారం నడుస్తోంది. కాగా ఈ సీజన్‌లో దసరా స్పెషల్‌గా స్టార్‌ హీరోయిన్‌ హోస్ట్‌గా వచ్చింది. కాగా యాంకర్ సుమ, అఖిల్ అక్కినేని, తదితరులు గెస్టులుగా వచ్చి సందడి చేశారు. ఇక ఈ వారాంతంలో నాగ్ తో పాటు నాగ చైతన్య కూడా స్టేజ్ పై అలరించనున్నారని అంటున్నారు. గత వారంలో చిరంజీవికి కరోనా వచ్చిందంటూ ఆయన హోమ్ క్వారంటైన్ కు వెళ్లడం, అంతకు రెండు రోజుల ముందే నాగార్జున, చిరంజీవి కలవడంతో, నాగ్ సైతం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే, నాగ్ కు నెగటివ్ వచ్చింది. దీంతో ఆయన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇక, ఈ వారాంతంలో నాగ చైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో వాస్తవం క్లారిటీ రావలంటే బిగ్‌బాస్‌ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

CLICK HERE!! For the aha Latest Updates