HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌ హోస్ట్ ఇతనే.. టీజర్‌ రిలీజ్‌ చేసిన 'స్టార్‌ మా'

బిగ్‌బాస్‌ హోస్ట్ ఇతనే.. టీజర్‌ రిలీజ్‌ చేసిన ‘స్టార్‌ మా’

9 27బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ముచ్చటగా మూడో ఏడాది సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దీనికి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈసారి స్టార్‌ నాగార్జున ‘బిగ్‌బాస్‌3’ కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను ‘స్టార్‌ మా’ అభిమానులతో పంచుకుంది.

మార్కెట్‌కు వచ్చిన నాగార్జునను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే, కిలోల కొద్దీ కూరగాయలు, వంట సామగ్రి ఆర్డర్‌ చేస్తూ కనిపించారాయన. చివర్లో ‘మీరు వచ్చారేంటి సర్‌’ అని ఓ దుకాణదారు అడిగితే ‘ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా’ అంటూ నాగ్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో 14మంది బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లనున్నారు. మొత్తం 100 రోజుల పాటు ఈ షోను నిర్వహించనున్నారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక తొలి సీజన్‌ విజేతగా శివబాలాజీ, రెండో సీజన్‌ విజేతగా కౌశల్‌లు నిలిచారు. మరి ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో వెళ్లేది.. విజేతగా నిలిచేది ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!