హీరో నాని ప్రొడ్యూసర్ గా రెండో సినిమా

నేచురల్‌ స్టార్‌ హీరో నాని ప్రొడ్యూసర్ గా మారి 2018 లో అ అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థ్రిల్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా నానికి మంచి లాభాలు తెచ్చింది. ఆ తరువాత నాని హీరోగా చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో… హీరోగా సినిమాపై దృష్టిపెట్టాడు. రీసెంట్ గా విడుదలైన జెర్సీ సినిమా మంచి విజయం సాధించడంతో నాని తిరిగి ప్రొడ్యూసర్ గా తన రెండో సినిమాను ప్లాన్ చేశాడు.

పక్కా కామెడీ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కబోతున్నది. స్వప్న మూవీస్‌తో కలిసి నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అనుదీప్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవీన్, ప్రియదర్శన్, రాహుల్ రామకృష్ణ, షాలిని పాండేలు నటిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది ఈ సినిమా.