Homeతెలుగు Newsఅటు అది, ఇటు ఇది.. మధ్యలో నయన్ !

అటు అది, ఇటు ఇది.. మధ్యలో నయన్ !

Nayanthara

లేడీ సూపర్ స్టార్ నయనతార తల్లి అయ్యాక, చిన్నగా హీరోయిన్ గా సినిమాలు తగ్గించుకుంటూ వెళ్తుంది. ఐతే, నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది నయన్. ఈ క్రమంలో నయనతార డిజిటల్ రంగంలోకి కూడా అడుగు పెట్టబోతోంది. అలాగే నయనతార నిర్మాణం బాట కూడా పట్టింది. నయనతార ఓ వెబ్ సిరీస్ లో నటించడంతో పాటు తనలోని నిర్మాతను కూడా సంతృప్తి పరుచుకుంటుంది. నయనతార నటించబోతున్న మొదటి వెబ్ సిరీస్ షూటింగ్ రీసెంట్ గానే మొదలు అయ్యింది.

కనెక్ట్ సినిమా దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో మెదలైన ఈ వెబ్ సిరీస్ లో నయనతార పూర్తిగా యాక్షన్ రోల్ చేస్తుండటం విశేషం. అంతే కాదు, నయనతార తొలిసారిగా ఈ వెబ్ సిరీస్ లో పోలీస్ పాత్ర పోషిస్తోంది. ఖాకీ పాత్రతో పాటు ‘వ్యభిచారం’ చేసే ముఠాకి నాయకురాలి అవతారంలో కూడా నయనతార దర్శనమివ్వనుంది. ఇలా ఎన్నో కొత్త అవతారాలు ఈ ఒక్క వెబ్ సిరీస్ లో నయనతార చూపిస్తోందట. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానున్న ఈ సిరీస్ లో నయనతార పై బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయట.

ఇప్పటికే షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న జవాన్ సినిమాతో హిందీ బాట పట్టిన నయనతార.. ఈ మధ్య సినిమాల వేగం తగ్గించింది. అలాగే విచ్చలవిడిగా మరీ బోల్డ్ గా నటించను అని మేకర్స్ చెబుతుంది. మొత్తానికి ఇటు నటిగా అటు నిర్మాతగా నయనతార ముందుకు పోతుంది. ఏది ఏమైనా నయనతార ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ ని కాపాడుకుంటూ హీరోయిన్ గా ఇంకా అవకాశాలు పొందుతూనే ఉంది.

దీనికితోడు నయనతార కి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. నయనతార పని అయ్యిపోయింది అనుకున్న ప్రతిసారి కొత్తగా ఆమె మన ముందుకొస్తోంది. అన్నట్టు సౌత్ లో నయనతార ప్రస్తుతం అజిత్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu