HomeTelugu Trendingపెళ్లి తరువాత కొత్తజంట ఫొటోలు

పెళ్లి తరువాత కొత్తజంట ఫొటోలు

Niharika and chaitanya 1st
మెగా ప్రీన్స్‌, నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహం నిన్న (బుధవారం) రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. చైతన్య జొన్నగడ్డతో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచింది నిహారిక. బంగారు వర్ణపు చీరలో మెరిసిపోయింది. వివాహం అనంతరం నిహారిక- చైతన్య జంట దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్‌ అండ్‌ వైట్‌ దుస్తుల్లో కనిపిస్తున్న ఈబ్యూటిఫుల్‌ కపుల్‌కి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రాజస్తాన్‌ ఉదయపూర్‌లో గల ఉదయ్ విలాస్‌లో బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు కుటుంబసభ్యులు, సన్నిహితుల నడుమ వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో మెగా హీరోలు అంతా సందడి చేశారు. వీరి ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!