HomeTelugu Big Storiesస్నేహ చికెన్‌కు నితిన్‌ యాడ్

స్నేహ చికెన్‌కు నితిన్‌ యాడ్

Nithin endorses sneha chick
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ ఇటీవల ఓ బ్రాండ్ తాను ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్టు ప్రకటించారు. ఈ యాడ్ షూట్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఆ ఫొటోలు చూసి చాలా మంది నితిన్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించబోతున్నారని అనుకున్నారు. అయితే, ఈ రోజు ఆ ప్రకటనకు సంబంధించిన వీడియో విడుదలైంది. హైదరాబాద్‌కు చెందిన స్నేహ చికెన్ బ్రాండ్‌ను నితిన్ ఈ వీడియో ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. నితిన్ లవ్‌లీ పెర్ఫార్మెన్స్, అనిల్ దర్శకత్వం ఈ యాడ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాయి’’ అని స్నేహ ఫ్రెష్ చికెన్ సీఈఓ వరుణ్ అన్నారు.

ఈ యాడ్ లో హీరో నితిన్ కి తల్లిగా సీనియర్ నటి ప్రగతి కనిపిస్తోంది. ప్రభాస్ ‘సాహో’ సినిమాకు సహ రచయితగా, అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన అనిల్ కుమార్ ఈ ప్రకటనను రూపొందించారు. వీడియోలో విజువల్స్, క్యాచీ సాంగ్ ప్రస్తుత తరాన్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. ‘తిన్నావా?’ అంటూ వచ్చే మాట సోషల్ మీడియాలో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. దాన్నే ఈ వీడియోలో వాడుకున్నారు. ఇదిలా ఉంటే, నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu