జ్యోతిక స్థానంలో నిత్య!

’36 వయధినిలే’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జ్యోతిక ప్రస్తుతం ‘మగలిర్ మట్టం’ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఆమె విజయ్ సరసన నటించబోతోందని వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో కాజల్, సమంత వంటి ఇద్దరి కథానాయికలతో పాటు జ్యోతిక కూడా ఓ హీరోయిన్
గా కనిపించబోతోందని అన్నారు.

కానీ ఇప్పుడు జ్యోతికకు బదులు ఆ స్థానంలో నిత్యమీనన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి జ్యోతిక ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నారో.. తెలియదు కానీ ఆ కారణంగా నిత్యమీనన్ మాత్రం మంచి ఛాన్స్ కొట్టేసింది. అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో కనిపిస్తుండడంతో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ బాణీలు అందించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.