యంగ్ హీరో నితిన్ ట్విటర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అందులో శివుడు కనిపించారు. ఆ ఫొటోను బాగా చూస్తే నితిన్ శివుడి వేషధారణలో ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని ఉద్దేశిస్తూ నితిన్ ట్వీట్ చేశారు. ‘నా స్నేహితుడికి ఈ ఫొటో ఆన్‌లైన్‌లో కనిపించింది. నాకు పంపి.. నువ్వు నీ తర్వాతి సినిమాలో శివుడి పాత్రను పోషిస్తున్నావా?అని అడిగాడు. దీన్ని (ఫొటో) ఎవరు చిత్రీకరించారో నాకు తెలియదు. ఒకవేళ ఆమె/ఆయన మనసులో నన్ను ఉంచుకుని ఈ బొమ్మ వేశారా? ఈ ఫొటో నన్ను పోలి ఉందా? నాకైతే కాస్త దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపిస్తోంది. మరి మీ అభిప్రాయం ఏంటి?’ అని ఆయన నెటిజన్ల ఉద్దేశం అడిగారు.
శ్రీనివాస కల్యాణం’ తర్వాత నితిన్ ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకుడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. దీని తర్వాత నితిన్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నటించబోతున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించబోతున్నారు. ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.
My friend found this pic online and sent me asking if i m playin lord shivas role in my next film..i dont know who made this or if he/she had me in their mind while making it? Does this pic even resemble me?i think somewhere it does!!wat do u all feel?🤔🤔 https://t.co/BIhcJEtQHR
— nithiin (@actor_nithiin) March 23, 2019













