ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది?..ఫొటోను షేర్‌ చేసిన నితిన్‌

యంగ్‌ హీరో నితిన్‌ ట్విటర్‌లో ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో శివుడు కనిపించారు. ఆ ఫొటోను బాగా చూస్తే నితిన్‌ శివుడి వేషధారణలో ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని ఉద్దేశిస్తూ నితిన్‌ ట్వీట్‌ చేశారు. ‘నా స్నేహితుడికి ఈ ఫొటో ఆన్‌లైన్‌లో కనిపించింది. నాకు పంపి.. నువ్వు నీ తర్వాతి సినిమాలో శివుడి పాత్రను పోషిస్తున్నావా?అని అడిగాడు. దీన్ని (ఫొటో) ఎవరు చిత్రీకరించారో నాకు తెలియదు. ఒకవేళ ఆమె/ఆయన మనసులో నన్ను ఉంచుకుని ఈ బొమ్మ వేశారా? ఈ ఫొటో నన్ను పోలి ఉందా? నాకైతే కాస్త దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపిస్తోంది. మరి మీ అభిప్రాయం ఏంటి?’ అని ఆయన నెటిజన్ల ఉద్దేశం అడిగారు.

శ్రీనివాస కల్యాణం’ తర్వాత నితిన్‌ ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకుడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. దీని తర్వాత నితిన్‌ చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో నటించబోతున్నారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందించబోతున్నారు. ఏప్రిల్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది.