ఎన్టీఆర్ ‘అరవింద సమేత’కు అతిథిలు లేరట!

జూనియర్‌ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు సాయంత్రం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలకృష్ణ అతిథిగా వస్తారని ప్రచారం జరుగుతుంది.. కానీ ఇప్పుడు ఈ వేడుక యొక్క ప్లాన్స్ మారాయట. వేడుకకు ప్రత్యేక అతిథులెవరూ లేరట.

బాలకృష్ణ కూడ కార్యక్రమానికి వచ్చే అవకాశాలు లేవట. వేడుక మొత్తం సింపుల్ గా అభిమానులు, సినిమాకు పనిచేసిన క్రూ సమక్షంలో జరగనుందట. అంతేకాదు సంగీత దర్శకుడు తమన్ స్పెషల్ స్టేజ్ షో ఉంటుందట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హారికం అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. సునీల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.