‘అరవింద సమేత’లో అనగనగనగా అంటూ.. ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత.. వీర రాఘవ’. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలోని తొలి లిరికల్‌ వీడియోను ‘అనగనగనగా’ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు తమన్‌ బాణీలు అందించారు. ‘చీకటిలాంటి పగటి పూట.. కత్తుల్లాంటి పూలతోట.. జరిగిందొక్క వింత వేట.. పులిపై పడిన లేడి కథ వింటారా?’ అంటూ సాగిన గీతాన్ని అమన్‌ మాలిక్‌ ఆలపించారు.

ఇప్పటికే విడుదల చేసిన చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభిస్తుండగా, శనివారం లిరికల్‌ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఈ సాంగ్‌ మొదలయ్యే ముందు పూజా హెగ్డే ఎన్టీఆర్‌తో ‘టఫ్‌గా కనిపిస్తారు.. కానీ మాట వింటారు’ అని అంటారు. ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌లో ఎన్టీఆర్‌ లుక్స్‌ అదిరిపోయేలా ఉన్నాయి. తమన్‌ అందించిన సంగీతం, అర్మాన్‌ మాలిక్‌ గాత్రం, పూజ హెగ్డే అందం అన్నీ హైలెట్‌గా నిలిచాయి. అరవింద పాత్రను పోషిస్తున్న పూజా హెగ్డేను ప్రేమలో దించడానికి ఎన్టీఆర్‌ పాడుతున్న ఈ పాట, పడుతున్న పాట్లు ఈ పాటలో కనిపిస్తున్నాయి. మొత్తానికి మరో కొత్త ఎన్టీఆర్‌ను అభిమానులకు అందించబోతున్నాడు త్రివిక్రమ్‌. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అందించేందుకు ప్లాన్‌చేస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్‌, నాగబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates