HomeTelugu Trendingప్రెస్‌మీట్‌లో భావోద్వేగానికి లోనైన ఎన్టీఆర్‌

ప్రెస్‌మీట్‌లో భావోద్వేగానికి లోనైన ఎన్టీఆర్‌

NTR emotional in RRR press
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు చిత్ర బృందం. ఇక ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ ని నేడు బెంగళూరులో నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, నిర్మాత డివివి దానయ్య మరియు రాజమౌళి హాజరు అయ్యారు.

ఇక ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. పునీత్ కి, ఎన్టీఆర్ కి మధ్య స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పునీత్ సినిమా కోసం ఎన్టీఆర్ ఒక సాంగ్ కూడా పాడారు. ఆ విషయాన్ని ఎన్టీఆర్ మీడియా ముఖంగా తెలుపుతూ ఆ సాంగ్ ని ఆలపించారు. పునీత్ నటించిన ‘చక్రవ్యూహ’ సినిమాలో గెలియా గెలియా అంటూ సాగే ఈ పాటను ఎన్టీఆర్ ఆలపించారు. అంతేకాకుండా ఈ సాంగ్ ని ఇంకెప్పుడు, ఎక్కడ పాడానని తెలిపారు.. పునీత్ ఎక్కడవున్నా.. ఆయన ఆశీర్వాదం తమపై ఉంటుందని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!