‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌!

‘కె.జి.ఎఫ్’ సినిమాని చూసిన చాలామంది హీరోలు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించాలని ఆశపడుతున్నారు. అతనితో సినిమాకు ఏవైనా అవకాశం ఉంటుందేమోనని చూస్తున్నారు. అలాంటి హీరోలు తెలుగులో కూడా ఉన్నారు. అయితే కోరుకోకుండానే ఆ ఛాన్స్ ఎన్టీఆర్‌ను వెతుక్కుంటూ వచ్చిందట.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అందులో ఎన్టీఆర్‌ను హీరోగా తీసుకోవాలని చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే తారక్ ఖాతాలో ఒక హెవీ మాస్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ పడటం ఖాయం.