ఎన్టీఆర్ బాగా తగ్గాడట!

టెంపర్ సినిమా నుండి తన లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ ఇలా ప్రతి సినిమా వైవిధ్యంగా కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ కొత్త లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమా తారక్ స్లిమ్ గా
కనిపించడానికి దాదాపు 10 కేజీల వరకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది.

మూడు రకాల పాత్రల్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో కనిపించబోతున్నాడు. దానికి జుట్టు, గడ్డం బాగా పెంచాడు. ఈ మూడు పాత్రలకు జోడీగా రాశి ఖన్నా, నివేదా థామస్ లను ఎంపిక చేశారు. మరో హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండని కారణంగా గెస్ట్ రోల్ లో ఓ స్టార్ హీరోయిన్ ను చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 15 నుండి సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నాడు.