HomeTelugu Newsడేట్‌ కన్ఫర్మ్ చేసుకున్న ఎన్టీఆర్ మహానాయకుడు!

డేట్‌ కన్ఫర్మ్ చేసుకున్న ఎన్టీఆర్ మహానాయకుడు!

5 15నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను రెండు భాగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి సినిమా రంగం గురించి వివరించే ఎన్టీఆర్ ‘కథానాయకుడు’, రెండో సినిమా ఎన్టీఆర్ ‘మహానాయకుడు’. కథానాయకుడు జనవరి 9 న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా పరంగా పెద్దగా నిలబడలేకపోయింది. భారీ కలెక్షన్లు వస్తాయి అనుకుంటే.. అనూహ్యంగా నష్టాలను మూటగట్టుకుంది.

ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ రంగం గురించి తీసిన మహానాయకుడు సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ఫిబ్రవరి 22 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధించిన సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. తెలిసిన కథే కావడం.. కొంతవరకే చూపిస్తారని తెలియడంతో సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!