HomeTelugu Trending‘ఊరికి ఉత్తరాన' ట్రైలర్‌

‘ఊరికి ఉత్తరాన’ ట్రైలర్‌

Ooriki Uttharana Trailer
నరేన్‌ వనపర్తి, దీపాలి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఊరికి ఉత్తరాన’. విభిన్న ప్రేమ కథా చిత్రంగా సిద్ధమైన ఈ సినిమా నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘ఊరికి ఉత్తరాన’ ట్రైలర్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. 30 సంవత్సరాలు వయసువచ్చినప్పటికీ పెళ్లికాని అబ్బాయి పాత్రలో హీరో నటించారు. ‘‘చదువు లేదు.. ఉద్యోగం లేదు.. మరి ఎందుకు వచ్చావు పెళ్లి చూపులకు. ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్కదానికి అర్హత లేదు’’ అంటూ పెళ్లి చూపులకు వెళ్లిన హీరోని పలువురు యువతులు రిజెక్ట్‌ చేస్తారు.

ఈ క్రమంలోనే జీవితంలో ఏదైనా సాధించాలని భావించి చదువుకోవడం కోసం స్కూల్‌లో జాయినైన ఆయన ఎలా ప్రేమలో పడతాడు? వాళ్ల ప్రేమకు ముగింపు ఏమిటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈగల్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటయ్య వనపర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu