HomeTelugu Big Storiesఉమెన్స్ డే' సందర్భంగా.. 'మగువా మగువా..' సాంగ్ వచ్చేసింది..

ఉమెన్స్ డే’ సందర్భంగా.. ‘మగువా మగువా..’ సాంగ్ వచ్చేసింది..

4 7
పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమా నుంచి మగువా మగువా ఫుల్‌ సాంగ్ వచ్చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. దీంతో విడుదలకు సిద్దమవుతోంది. అందులో భాగంగా మార్చ్ 8న ‘ఉమెన్స్ డే’ సందర్భంగా ‘మగువా మగువా’ పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన ప్రోమో సాంగ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

సింగర్‌ సిధ్ శ్రీరామ్ ఈ పాట పాడగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు.. థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ప్రోమో సాంగ్‌కు మంచి స్పందన లభించింది. పవన్ ఫ్యాన్స్‌ అయితే ఈ పాట విని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మగువ మగువ.. ఈ లోకానికి తెలుసా నీ విలువా’ అంటూ సాగే ఈ పాట ఖచ్చితంగా వైరల్ అయ్యేలా కనిపిస్తుంది. సమ్మర్‌ను టార్గెట్ చేసుకుని మే 15న ‘వకీల్ సాబ్’ విడుదల కానుంది. MCA ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!