గడ్డం తీసేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్!.. ఫోటో వైరల్‌

ప్రముఖ నటుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. రాజకీయాల్లోకి ప్రవేశించిన దగ్గరనుండి తన గ్లామర్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రచార సమయంలో అయితే అస్సలు పట్టించుకోలేదు. గడ్డం, జుట్టు విపరీతంగా పెరిగిపోతున్నా లెక్కచేయలేదు. కనీసం ఎన్నికల ఫలితాల తర్వాతైనా కొంచెం మేకోవర్ అవుతారనుకుంటే అలా కూడా చేయలేదు. కానీ ఉన్నట్టుండి ఆయన మనసు మారింది. ఒక్కసారిగా గడ్డం మొత్తం తీసేసి, హెయిర్ కట్ చేయించి పాత లుక్ తెచ్చుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ మళ్ళీ అందంగా తయారవడ్డంతో అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.