హైదరాబాద్‌ హలీమ్‌ని మిస్‌ అవుతున్నా: పూజా హెగ్డే


టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉంది. ఈ భామ తాజాగా తమిళంలో అదిరిపోయే ఆఫర్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. అంతేకాదు దాదాపు పూజ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం ఖాయం అని తెలుస్తుంది.

ఇక పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. దాంతో అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాలోను నటిస్తోంది. వీటికి తోడు హిందీలో సల్మాన్‌తో పాటు అక్షయ్ సినిమాలో కూడా పూజా నటించనుంది. అది అలా ఉంటే.. పూజా హెగ్డే ఈ లాక్ డౌన్ ఓ ట్వీట్‌ చేసింది ‘ఈ రంజాన్ నెలలో హైదరాబాదులో లభ్యమయ్యే హలీమ్‌ వంటకాన్ని బాగా మిస్ అవుతున్నాను’ అంటూ ఈ చిన్నది చెప్పుకొచ్చింది.