ఎన్టీఆర్‌పై పూనమ్‌ కౌర్‌ భావోద్వేగ ట్వీట్‌.. వైరల్‌


హీరోయిన్‌ పూనమ్ కౌర్.. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న… ఏ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలు కూడా చేసింది. అయితే, ఆమె తన సినిమాల కంటే పలు వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగా రకరకాల అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని ధైర్యంగా వెల్లడిస్తుంది. తాజాగా పూనం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ నటి పూనం కౌర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. చిన్నప్పటి నుంచి తిరస్కరణకు గురయ్యాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ఆమె వ్యాఖ్యల సారాంశం ఏమంటే.. ‘ఎదుగుతున్న వయసులో అకారణంగా తన తప్పు ఏమాత్రం లేకున్నా అయినవారి ప్రేమకు దూరమయ్యాడు. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు.. అతని ప్రయాణం.. ఎదిగిన తీరుకు నేను ఎంతో గౌరవిస్తున్నా. స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్’ అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో ఎక్కడా ఎవరిపేరు లేకున్నా.. ఈ ట్వీట్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి పూనం కౌర్ పరోక్షంగా చేసిందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. అంతేకాదు పూనం ట్వీట్ ను పలువురు ఎన్టీఆర్ అభిమానులు స్వాగతిస్తూ.. తమ అభిమాన నటుడు గురించి అంత భావోద్వేగం రాసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.