HomeTelugu Trendingప్రభాస్ ఇలా అవుతాడని ఊహించలేదు: కృష్ణంరాజు

ప్రభాస్ ఇలా అవుతాడని ఊహించలేదు: కృష్ణంరాజు

Eswar movie
ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో మంగళవారం హైద్రాబాద్‌లో కృష్ణంరాజు ఇంట్లో ఈ వేడుకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొందరు అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమాతో ప్రభాస్‌ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్‌తో పాటు కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ప్రభాస్ హీరోగా పరిచయమై అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అనే సందేహం కలుగుతుంది అన్నారు రెబెల్ స్టార్ కృష్ణం రాజు. మా గోపీకృష్ణ బ్యానర్‌లో ప్రభాస్‌ని హీరోగా మేమే పరిచయం చేయాలని అనుకున్నాం. ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు.

ఈశ్వర్ కథ బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, అందరికి నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్‌కు ఓకే చెప్పాం అన్నారు. ఆ సినిమా మంచి విజయంతో ప్రభాస్‌ని హీరోగా నిలబెట్టింది. ప్రభాస్ మొదటి సినిమా చూసాక తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఎవరూ ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల, అభిమానుల అండదండలు కారణం అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!