‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అంటూ పూరీ


పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాలో నటిస్తున్నారు. అభిరామ్‌ ఎమ్‌ దర్శకుడు. ఇప్పటికే విడుద‌లైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం టీజర్‌ను మెగా బ్రదర్ నాగబాబు, సెకండ్ లిరికల్ సాంగ్‌ను వైఎస్ షర్మిల రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ టైటిల్ బాగుందని మెచ్చుకున్నారు. విభిన్న కథాంశంతో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది అన్నారు. సినిమా చాలా బాగుంటుందన్నారు. ఈ సినిమాకి కార్తిక్‌ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. మార్చి 19 న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates