HomeTelugu Big Stories'సాహో' కోసం వాయిదాపడ్డ నాలుగు చిత్రాలు.. ధన్యవాదాలు తెలిపిన ప్రభాస్‌

‘సాహో’ కోసం వాయిదాపడ్డ నాలుగు చిత్రాలు.. ధన్యవాదాలు తెలిపిన ప్రభాస్‌

3 5భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘సాహో’ విడుదల సజావుగా జరిగేందుకు నాలుగు చిత్రాల దర్శక, నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ధన్యవాదాలు తెలిపారు. నిజానికి ‘సాహో’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాని కారణంగా విడుదల తేదీని 30కి వాయిదా వేశారు. అయితే అదే రోజు విడుదల కావాల్సిన సినిమాలకు స్క్రీన్ల విషయంలో సమస్యలు ఏర్పడ్డాయి. ఏదేమైనప్పటికీ ‘సాహో’ కోసం మిగిలిన దర్శక, నిర్మాతలు రాజీపడ్డారు. తమ సినిమాల్ని వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలో ప్రభాస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సోషల్‌మీడియాలో పోస్టులు చేశారు. ‘ఆగస్టు 30న ‘సాహో’కు దారి కల్పించేందుకు తమ చిత్రాల విడుదల తేదీలు రీ-షెడ్యూల్‌ చేసుకున్నందుకు నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు బిగ్‌ థాంక్స్‌. ‘సాహో’ చిత్ర బృందం మీకు ధన్యవాదాలు చెబుతోంది. అదేవిధంగా మీకు ఆల్‌ ది బెస్ట్‌. మీపై ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటాయి’ అని ప్రభాస్‌ పోస్ట్‌ చేశారు.

ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘సాహో’ సినిమాకు స్క్రీన్లు కల్పించేందుకు చిత్ర పరిశ్రమ మాకు అండగా నిలిచింది. ‘సాహో’కు మద్దతు తెలిపింది. పలు చిత్రాల దర్శక, నిర్మాతలు తమ విడుదల తేదీలు మార్చుకున్నారు. దేశవ్యాప్తంగా విడుదల కావాల్సిన నాలుగు సినిమాలు ‘సాహో’కు దారికల్పించాయి. ఈ నిర్ణయం తీసుకున్న దర్శక, నిర్మాతలకు మా ధన్యవాదాలు’ అని యూవీ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

‘సాహో’ సినిమాలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించారు. సుజీత్‌ దర్శకత్వం వహించారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu