HomeTelugu Big Storiesప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

Pranab Mukharjee Passes awaమాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. ఢిల్లీలో ఆర్మీ ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఆరోగ్యం విషమించి కొద్ది సేపటి క్రితం మృతిచెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 13వ భారత రాష్ట్రపతిగా, కేంద్ర ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖతోపాటు అనేక పదవులు ఆయన అధిష్టించారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ప్రణబ్‌ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు.

ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబరు 11న పశ్చిమ బెంగాల్‌లోని మిరితిలో జన్మించారు. ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్‌ఎల్‌బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ) వంటి విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా పనిచేశారు. 2012, జులై 25 నుంచి 2017, జులై 25 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. 1969లో ఇందిరా గాంధీ హయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 1973లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా, ఆర్థిక మంత్రిగానూ సేవలందించారు. 2012లో యూఏపీ మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచి పీ.ఏ. సంగ్మాను ఓడించారు. 70శాతం ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవీకాలం పూర్తయ్యాక రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu