పూరి ప్లాన్ వర్కవుట్‌ అవుతుందా!

కెరీర్ ప్రారంభంలో వరస హిట్స్ తో దూసుకుపోయిన పూరి… ఇటీవల కాలంలో చాలా వెనకబడ్డాడు. సినిమాలు వరసగా ప్లాప్ అవుతున్నాయి. టెంపర్ తరువాత పూరికి హిట్ లేదు. ప్రస్తుతం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. పక్కా హైదరాబాద్ కుర్రాడి స్టోరీ. సినిమా స్టార్ట్ చేసిన తరువాత షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నాడు.

హైదరాబాద్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న యూనిట్ వారణాసి వెళ్ళింది. అక్కడ యాక్షన్స్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. వారణాసి షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది. మే నెలలోనే సినిమాను విడుదల చేయాలని పూరి ప్లాన్ చేస్తున్నాడు. పూరి మేకింగ్ విషయంలో తన స్టైల్ ను ఏ మాత్రం మార్చడం లేదు. తక్కువ సమయంలో షూట్ ను కంప్లీట్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాడు పూరి.