HomeTelugu Trendingపీవీ సింధు వర్కౌట్‌ వీడియో.. వైరల్‌

పీవీ సింధు వర్కౌట్‌ వీడియో.. వైరల్‌

11 17ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ కోసం ఆమె ఏ స్థాయిలో సన్నద్ధమయిందో చూపుతున్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా షేర్‌ చేశారు. ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడం వెనక ఎలాంటి మర్మం లేదని, ఆమె కష్టాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ట్వీట్‌ చేశారు. ఆయన షేర్‌ చేసిన వీడియోలో సింధు ఎంతో కష్టపడుతూ కనిపించింది. జిమ్‌లో వివిధ వర్కౌట్లు చేసింది. హైదరాబాద్‌లోని సుచిత్ర బ్యాడ్మింటన్‌ అకాడమీలో ఆమె సాధన తీసుకున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

ఈ ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో నొజోమి ఒకుహర(జపాన్‌)పై సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. టోర్నీ పూర్తి చేసుకుని నిన్ననే సింధు భారత్‌ చేరుకుంది. ఆమెకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. భారత్‌కు రాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజును కలిసి పసిడి పతకాన్ని చూపించింది. అనంతరం హైదరాబాద్‌ చేరుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!