జూనియ‌ర్ త‌మ‌న్నా అంటున్నారు!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు చెల్లెలు ఉందో? లేదో?  తెలీదు కానీ…. సేమ్ టు సేమ్ ఫీచ‌ర్స్‌తో ఇటీవ‌ల ఓ అమ్మ‌డు టాలీవుడ్ లో ప్ర‌త్య‌క్ష‌మై జోరుగా హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇంట‌ర్వ్యూల్లో తెగ‌ హ‌డావుడి చేస్తోంది. ఏ న‌లుగురు గుమిగూడినా ఇదే ముచ్చ‌ట‌. ఎవ‌ర‌బ్బా ఈ జూనియ‌ర్ మిల్కీ? ఇంతందంగా పాల‌నురుగు దేహ‌శిరుల‌తో మిల‌మిల మెరిసిపోతోంది? అంటూ తెగ ముచ్చ‌ట్లాడుకుంటున్నారు. ఏనోట విన్నా ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. ఇంత‌కీ ఎవరా జూనియ‌ర్ త‌మ‌న్నా? ఏ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతుంది?  చెక్ డీటెయిల్స్..
 
ఈ న‌వ‌త‌రం నాయిక పేరు రాధిక మ‌ల్హోత్రా. ‘ప్రేమ ఎంత మ‌ధురం ప్రియురాలు అంత క‌ఠినం’ అనే చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. పుట్టి పెరిగింది జైపూర్ లో. చిన్న నాటి నుంచి సినిమాలంటే విప‌రీత‌మైన‌ పిచ్చి. ఆ ఫ్యాష‌న్ తోనే ఇప్పుడు టాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తుంది. ప్ర‌స్తుతం సినిమా ప్రమోష‌న్ లో జోరుగా  పాల్గొంటూ.. కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొడుతోంది. తొలిసారి ప‌రాకుగా చూస్తే.. అరే త‌మ‌న్నానా? అనేస్తున్నారు..  చూడ‌టానికి అచ్చం త‌మ‌న్నా లా ఉంద‌ని మార్కులు కొట్టేసింది. అవును నువ్వు మిల్కీవేనంటూ ఫిలిం జ‌ర్న‌లిస్టులు సైతం కితాబిచ్చేశారు.  ఇదే విష‌యాన్ని త‌న‌ వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా కాలేజ్ డేస్ లో స్నేహితులు కూడా అలాగే అనేవార‌ని త‌న‌లో తాను తెగ‌ మురిసిపోయింది. మ‌రి త‌మ‌న్నా రూపురేఖ‌లు స‌రే.. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందంటారా? చూద్దాం.⁠⁠⁠⁠.. ఎవ‌రి ఫేట్ ఎలా ఉందో?