HomeTelugu Trendingలారెన్స్‌ సంచలన నిర్ణయం.. కారణం అదేనా..

లారెన్స్‌ సంచలన నిర్ణయం.. కారణం అదేనా..

5 21
డ్యాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు.. రాఘవ లారెన్స్ జీవితంలో ఎన్నో కష్టాలను ఓడ్చి.. కిందిస్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. ఇలా అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. ఇక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే లారెన్స్.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు రాఘవ లారెన్స్ ” హాయ్ ఫ్రెండ్స్.. మీకో విషయం చెప్పాలనుకుంటున్నా.. ఇక నుంచి బయట జరిగే ఏ కార్య్రమానికి నేను హాజరుకాబోను.. రజినీకాంత్ సినిమాకు సంబంధించిన కార్యక్రమం అయితే… ఆయన పర్మిషన్ తీసుకొని వస్తాను.. ఈ నిర్ణయం వెనక ఎన్నో కారణాలున్నాయి.. అవన్నీ మీతో చెప్పలేను.. నాకు రజినీకాంత్ దీవెనల కన్నా ఏది ఎక్కువ కాదు” అని పేర్కొన్నాడు. అయితే, ఈ నిర్ణయం తాజాగా చోటు చేసుకున్న వివాదమే కారణమా? అనే గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి.

ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా మూవీ ‘దర్బార్’ ఆడియో ఈవెంట్‌కు హాజరైన లారెన్స్… లోకనాయకుడు కమల్ హాసన్ పై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి… అప్పట్లో కమల్ సార్‌కు సినిమా విడుదలైనప్పుడు ఆ పోస్టర్స్‌పై పేడ కొట్టేవాడని అంటూ చెప్పడం వివాదానికి దారితీసింది. తాను చిన్నప్పటి నుంచి రజినీకాంత్ అభిమానిని.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడస్తున్నారు. స్నేహ బంధం కన్నా గొప్పది ఏదీ కాదని ఇప్పటికీ నాకు అర్ధమైందన్నారు. అయితే, కమల్ ఫ్యాన్స్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు… ఆయన మాట్లాడిందంతా వదిలేసి… కేవలం కమల్ సినిమా పోస్టర్లపై పేడ వేసేవాడినంటూ చేసిన వ్యాఖ్యల వరకే కట్ చేసి… లారెన్స్‌ను ట్రోల్ చేస్తూ ఆ వీడియోను షేర్ చేస్తూ… తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే, ఇది తీవ్ర వివాదంగా మారడంతో చివరకు కమల్‌ను కలిసిన లారెన్స్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి.. వివాదానికి తెరదించాడు… ఇక ఈ గొడవు ఎందుకులే అనుకున్నాడేమో లారెన్స్… ఏ కార్యక్రమానికి హాజరుకాకూడదనే నిర్ణయానికి వచ్చినట్టున్నాడు. మొత్తానికి లారెన్స్ నిర్ణయానికి రజనీకాంత్-కమల్ హాసనే కారణం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!