ఆ హీరోల డేట్స్ కు ఈయన క్యారెక్టర్ కు లింక్!

నటుడిగా పలు సినిమాల్లో తన నటనను ప్రదర్శించిన రాజారవీంద్ర గతంలో చిరంజీవి, రవితేజ వంటి హీరోల దగ్గర మ్యానేజర్ గా పని చేశాడు. ఆ తరువాత కొన్ని కారణాలతో వారి నుండి సెపరేట్ అయ్యి ఇప్పుడు యంగ్ హీరోలు నిఖిల్, రాజ్ తరుణ్ ల డేట్స్ ను చూసుకుంటున్నాడు. అయితే ఏ దర్శకుడైనా.. ఆ హీరోలకు కథ చెప్పాలంటే ముందుగా రాజారవీంద్రకు వినిపించాలి.
అందులో ఆయన పాత్ర కూడా చాలా బలంగా ఉండాలి. అప్పుడైతేనే.. దర్శకుడు హీరోలను రీచ్ అవ్వగలరట. కథలో తన పాత్రకు ప్రాముఖ్యత లేకపోయినా.. కావల్సిన క్యారెక్టర్ ఇవ్వలేకపోయినా.. ఇక హీరోల డేట్స్ సంగతి మర్చిపోవడమే. దీంతో దర్శకులు రాజారవీంద్ర కోసం ప్రత్యేకంగా పాత్రలను సృష్టిస్తున్నారట. నిర్మాతలు కూడా హీరోల డేట్స్ కోసం ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ‘అంధగాడు’ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ రాజారవీంద్రకు దక్కిందని చెబుతున్నారు. ఒకట్రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపించే ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోల పుణ్యమా అనే తన కెరీర్ ను బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు.