హార్వర్డ్ యూనివర్సిటీ నుండి రాజమౌళి ఆహ్వానం

దర్శకుడు రాజమౌళి కెరీర్లో తీసిన సినిమాలు చాలా తక్కువే అయిన తీసిన చిత్రాలన్నీ సూపర్ హిట్టే. టాలీవుడ్ ఏస్ దర్శకుడిగా రాజమౌళి పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి 2 – కంక్లూషన్ సినిమాలతో ప్రపంచస్థాయిలో పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలు సాధించిన కలెక్షన్లు అన్నీఇన్నీకావు. అంతేకాదు.. ఈ సినిమా అనేక అవార్డులను సొంతం చేసుకుంది.

తాజాగా రాజమౌళి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న రెస్టారెంట్ చైన్ గోదావరి ఆధ్వర్యంలో హార్వర్డ్ యూనివర్శిటీలో ఇండియా కాన్ఫరెన్స్ 2019 సదస్సును నిర్వహించబోతున్నది. ఈ సదస్సుకు హాజరుకావాల్సిందిగా రాజమౌళిని ఆహ్వానించింది. ఫిబ్రవరి 17 వ తేదీన జరిగే కాన్ఫరెన్స్ లో రాజమౌళి పాల్గొంటాడు. ఇది రాజమౌళికి దక్కిన అరుదైన గౌరవం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, షారుక్ ఖాన్ లకు గతంలో ఈ సదస్సులో పాల్గొనే అవకాశం దక్కింది