బాస్ పై రాజమౌళి కామెంట్!

చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఆరోజు రానే వచ్చింది. సినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ బజ్ ను సంపాదించుకుంది. అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం పదేళ్ళ తరువాత చిరంజీవి ఎలా కనిపించబోతున్నాడని ఆతురతగా
ఎదురుచూసింది. ఇంకేముంది సినిమా రిలీజ్ అయిన వెంటనే సెలబ్రిటీలంతా థియేటర్లలో వాలిపోయారు. దర్శకధీరుడు రాజమౌళి, రాఘవేంద్రరావు, అల్లు అర్జున్, హరీష్ శంకర్, గోపిచంద్, మారుతి ఇలా చాలా మంది హీరోలు సినిమాను చూసి తమ అభిమాన నటుడ్ని కొనియాడుతున్నారు.

ముందుగా రాజమౌళి ”చిరంజీవి గారు.. మళ్ళీ వెనక్కి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ పదేళ్ళు మిమ్మల్ని మిస్ అయ్యాం అన్నారు” అలానే రికార్డ్ బ్రేకింగ్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించావని చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైన స్టయిల్ లో స్పందించారు. ‘సినిమా చేసి చాలా రోజులైంది అనే మాట కేవలం మాటవరసకు మాత్రమే.. అదే జోరు.. అదే ఊపు.. అదే గ్రేసూ.. జై చిరంజీవా.. జగదేకవీరా’ అని తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.