రాజశేఖర్‌ ‘కల్కి’ టీజర్‌

సీనియర్ నటుడు రాజశేఖర్‌లో ‘గరుడవేగ’ మూవీ కొత్త ఉత్సహం నిపిందనే చెప్పాలి. చాలాకాలంగా సరైన హిట్‌ కోసం ఎదరుచూసిన ఈ హీరోకు సరైన టైమ్‌లో సరైన సినిమా పడింది. ఈ సినిమా అంచనాలకు మించి ఆడటంతో రాజశేఖర్‌ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి నెలకొంది. ఈ సినిమాలో అదాశర్మ హీరోయిన్‌. నందితా శ్వేత, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌, రాహుల్‌ రామకృష్ణ, నాజర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్‌ పతాకంపై సి. కల్యాణ్, శివానీ, శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.‌

నేడు (ఫిబ్రవరి 4) రాజశేఖర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ టీజర్‌ను విడుదల చేశారు. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో ఎంట్రీ ఇచ్చిన యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ టీజర్‌తో అదరగొట్టేస్తున్నాడు. 1980 నేపథ్యంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా క్రైమ్‌ బ్యాగ్రౌండ్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. మొత్తానికి కల్కితో మరో విజయాన్ని సొంతం చేసుకునేలా ఉన్నారు రాజశేఖర్‌. ఈ చిత్రాని సి కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని ఈ మూవీకి సమకూరుస్తున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates