హీరో రాజశేఖర్ ఇంట వివాహ వేడుక

సినీయర్‌ హీరో రాజశేఖర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన మేనల్లుడు కార్తిక్ వివాహం దీప్తి సాయితో గురువారం ఉదయం హైదరాబాద్‌లో జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఉన్న పార్క్ హయత్‌లో వీరి వివాహాన్ని వైభవంగా జరిపారు. ఈ వివాహ వేడుకలో వధూవరుల కుటుంబాలతో పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు. భార్య జీవిత, కుమార్తెలు శివాని, శివాత్మికలతో కలిసి రాజశేఖర్ ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. సంప్రదాయ లుంగీలో రాజశేఖర్ లుక్ అదిరిపోయింది. హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమవుతోన్న శివాని సైతం ఆకట్టుకుంది.

కాగా, కిందటేడాది ‘పీఎస్వీ గరుడవేగ’ తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రాజశేఖర్.. ప్రస్తుతం ‘కల్కి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ‘ఆ!’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో ‘కల్కిని’ పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యానిమేషన్‌తో కూడిన టైటిల్ మోషన్ పోస్టర్‌ చూస్తుంటే ఆకట్టుకుంది. శివానీ శివాత్మిక మూవీస్ స‌మ‌ర్పణ‌లో హ్యపీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మనాలీలో షూటింగ్ చేస్తున్నారు. కాగా, 1983లో తెలంగాణలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

CLICK HERE!! For the aha Latest Updates