జరిమానాపై.. లైట్‌ తీస్కో.. పని చేస్కో అంటున్న రామ్‌

సినీనటుడు రామ్‌కు సిగరెట్‌ తాగినందుకు చార్మినార్‌ పోలీసులు.. జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా షూటింగ్‌ సందర్భంగా చార్మినార్‌ వద్ద బహిరంగ ప్రదేశంలో సిగరెట్‌ కాల్చినందుకు ఆయన రూ.200 జరిమానా కట్టారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై రామ్‌ స్పందించలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై తాజాగా రామ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘నా టైం, పబ్లిక్‌ టైం వృథా చేయడం ఇష్టంలేక ఇప్పటివరకు స్పందించలేదు తమ్మీ. షాట్‌లో సిగరెట్‌ కాల్చాను. విరామ సమయంలో కాదు. టైటిల్‌ పాటలో నేను సిగరెట్‌ కాల్చిన స్టెప్పు చూస్తారుగా..! అయినా కూడా నేను చట్టాన్ని గౌరవించి జరిమానా కట్టాను. లైట్‌ తీస్కో.. పని చేస్కో’ అని పేర్కొన్నారు రామ్‌.