HomeTelugu Trendingరామ్‌ గోపాల్‌ వర్మ గురించి సీక్రెట్స్ బయటపెట్టిన తల్లి..

రామ్‌ గోపాల్‌ వర్మ గురించి సీక్రెట్స్ బయటపెట్టిన తల్లి..

9 24
దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది ఓ సంచలనమే. వర్మ సినిమా వార్తల్లో నిలుస్తూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. వర్మకు బంధాలు, బంధుత్వాలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు వర్మ భార్యకు విడాకులు ఇచ్చాడు. వర్మ కూతురు కూడా ఆయన్ను చీదరించుకుంటుంది. ఇటీవలే వివాహం చేశారు.

ఆడవాళ్ళను, వోడ్కాతో పోల్చే వర్మ సినిమాల్లో హీరోయిన్లను అందంగా చూపించడంలో ముందు ఉంటాడు. ఇక ఇదిలా ఉంటె, వర్మ సినిమా బ్యూటిఫుల్ సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా కోసం పార్టీ ఇచ్చాడు. ఈ ప్రైవేట్ పార్టీలో వర్మ తల్లి కూడా పాల్గొన్నది. వర్మ గురించిన కొన్ని సీక్రెట్స్ ను ఆమె బయటపెట్టింది. వర్మకు మంచోడు అనే పదానికి అర్ధం తెలియదని, ప్రేమ లేదు అంటుంటాడు. దాని అర్ధం ప్రేమ ఉందని. బంధాలు, బంధుత్వాలు తెలియవని అంటాడు. అది వందశాతం తప్పు. వర్మ బ్యాడ్ బాయ్ కాదు గుడ్ బాయ్. బ్యాడ్ స్టూడెంట్ అని చెప్తుంటాడు. కానీ, పరీక్షల్లో మాత్రం టాప్ మార్కులతో పాస్ అవుతాడు. వర్మ ఏకలవ్యుడు. ఏ విషయమైనా యిట్టె నేర్చేసుకుంటాడు. 30 ఏళ్ల నుంచి చెప్పాలి అనుకున్న మాట ఇప్పుడు చెప్తున్నా అని చెప్పింది. తల్లి మాటలపై స్పందించిన వర్మ కష్టపడి సంపాదించుకున్న రెప్యుటేషన్ మొత్తం నాశనం చేసింది. రాముడు మంచి బాలుడు అనే తిట్టు తెలుగు భాషలో లేదు అని చమత్కరించాడు వర్మ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!