గురు సీక్వెల్.. హీరో మారాడు!

దర్శకురాలు సుధా కొంగర ఇటీవల గురు సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు సినిమాకు అన్ని చోట్ల నుండి పాజిటివ్ స్పందన రావడంతో ఆమె సీక్వెల్ చేయడానికి రెడీ అవుతుందని సమాచారం. సాధారణంగా సీక్వెల్ అంటే నటీనటులు మారతారేమో గానీ హీరో మాత్రం మారడు.

కానీ ఇప్పుడు గురు సీక్వెల్ లో హీరో మారబోతున్నాడు. వెంకీను పక్కన పెట్టేసి రానాను ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా సుధా, రానాను కలిసి కథ కూడా వినిపించిందని సమాచారం. రానాకు కథ నచ్చడంతో త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ప్రస్తుతం రానా, తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే సుధాతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు.