క్యాస్టింగ్ కౌచ్ పై రాశీఖన్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న మ‌హ‌మ్మారి క్యాస్టింగ్ కౌచ్. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు మొత్తం ప‌ని గ‌ట్టుకుని మ‌రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మ‌ధ్య కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీలో ఇది లేద‌ని చెప్ప‌ను కానీ.. త‌న‌కు మాత్రం ఎప్పుడూ ఎదురుప‌డ‌లేద‌ని చెప్పింది. అంటే క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

ఇక ర‌కుల్ కూడా త‌ను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నేళ్లైనా కూడా ఏ రోజు కూడా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కు ఇలాంటి అనుభ‌వం ఎదురు కాలేద‌ని షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనిపై అప్ప‌ట్లో శ్రీ రెడ్డి చాలా సెటైర్లు వేసింది. క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటో తెలియ‌కుండానే కోట్ల‌కు కోట్లు పెట్టి జిమ్ బిజినెస్ చేస్తున్నావా అంటూ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. ఇక స‌మంత కూడా ఈ విష‌యంపై స్పందించింది. ఇలాంటి నీచులు ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉన్నారని అప్ప‌ట్లో సీరియ‌స్ కామెంట్స్ చేసింది స‌మంత‌.

క్యాస్టింగ్ కౌచ్‌ అనేది ఒక్క సినిమా ఇండ‌స్ట్రీలోనే ఉంటుంద‌ని అనుకుంటార‌ని.. కానీ అన్ని చోట్లా ఇది ఉంద‌ని చెప్పింది సమంత. ఈ విష‌యంలో కేవలం సినిమా ఇండస్ట్రీని చెడుగా టార్గెట్ చేయడం మంచిది కాదని హిత‌వు ప‌లికింది స‌మంత‌. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హిట్, ఫ్లాప్‌లు క‌చ్చితంగా ఉంటాయ‌ని.. త‌న‌కు తొలి నాళ్ల‌లోనే వ‌ర‌స విజ‌యాలు రావ‌డంతో ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ అనుభ‌వం ఎదురు కాలేద‌ని చెప్పింది స‌మంత‌. దానికితోడు ఇప్పుడు రాశీఖ‌న్నా కూడా త‌న‌కు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ లైంగిక వేధింపులు రాలేద‌ని చెప్పింది.

వేధింపులకు గురౌతున్న వారు ముందుకు వచ్చి దైర్యంగా చెప్పడం చాలా గ్రేట్‌ అన్నారు. ఇలా తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటకొచ్చి నిర్భయంగా చెప్పడం చిన్న విషయం కాదంటోంది రాశీ ఖన్నా. ఇక ‘మీటూ’ అంటూ తనకు చెప్పుకోవడానికి ఏమీ లేదంటుంది ఈ అమ్మడు. వీళ్ళు మాత్ర‌మే కాదు.. ఇండ‌స్ట్రీలో పేరు మోసిన స్టార్ హీరోయిన్లు ఎవ‌రూ క్యాస్టింగ్ కౌచ్ త‌మ‌కు తెలియ‌ద‌నే చెప్తున్నారు. కానీ చిన్న హీరోయిన్లు మాత్రం ఇండ‌స్ట్రీలో ప‌డుకోక‌పోతే అవ‌కాశాలు రావ‌ని ఓపెన్‌గా చెబుతున్నారు. అప్పుడ‌ప్పుడూ కంగ‌న ర‌నౌత్, త‌ను శ్రీ ద‌త్తా, మాధ‌విల‌తా లాంటి హీరోయిన్లు అయితే ఏకంగా ప‌డుకోక‌పోతే ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.