మాయ చేస్తోన్న సమంత


పెళ్లి తరువాత కూడా సమంత సినిమాల్లో చేస్తూ టాప్ నటిగా దూసుకుపోతోంది. పెళ్లయ్యాక గతేడాది వరసగా సినిమాలు చేసి విజయం సాధించింది. ఈ సంవత్సరం కూడా అదే ఊపును కొనసాగించేందుకు సిద్ధమైంది సమంత. భర్త నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’ చేస్తున్నది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. సమ్మర్ స్పెషల్ గా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సమంత ఓ మధ్యతరగతి మహిళగా కనిపించబోతోంది. ఇదిలా ఉంటె, సమంత రీసెంట్ గా బ్లాక్ అండ్ బ్లాక్ నెట్ డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో సమంత అచ్చం ఎల్లోరా శిల్పంలా ఉండటం విశేషం. సమంత బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.