రష్మిక హార్ట్ టచింగ్ ట్వీట్

టాలీవుడ్ లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక… విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమాతో హైలైట్ అయ్యింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యేందుకు ఈ సినిమా రూట్ ను క్రియేట్ చేసింది. సినిమాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అటు సోషల్ మీడియాలో కూడా రష్మిక అంతే యాక్టివ్ గా ఉంటోంది.

రీసెంట్ గా రాయచూర్ అడవుల్లో ఇంజనీర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రగడ జరుగుతోంది. దీనిపై సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు స్పందిస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై రష్మిక స్పందించింది.

“అసలు మనుషుల్లో మానవత్వం ఎక్కడుంది. రాయచూర్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మధుపై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నా గుండెను బద్దలు చేసింది. ఇంకా ఎంత మంది ఇలాంటివి ఎదుర్కోవాలి?. ఆమెకు న్యాయం జరగాలని.. ఇదే చివరి సంఘటన కావాలని ఆశిస్తున్నా’అని ట్వీట్ చేసింది.