HomeTelugu Trending'ఖిలాడి' టీజర్‌ డేట్‌ ఫిక్స్‌

‘ఖిలాడి’ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌

Khiladi teaser release date

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. హావీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ మరియు అనసూయ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఇటలీలో షూటింగ్ జరుగుతున్న ఖిలాడి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టు వార్తలు వచ్చాయి. కాగా ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి మాస్ మహారాజ అభిమానులతో పాటు కామన్ ఫ్యాన్స్‌కి భారీ సర్‌ప్రైజ్ రాబోతోంది. ఖిలాడి టీజర్ ఈనెల 12న ఉదయం 10గం.08 నిముషాలకి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!