నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘దసరా’. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలకానుంది. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది ఈ చిత్రం.
ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీగా బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. చమ్మీల అంగిలేసి సాంగ్ ట్రైలర్, ధూమ్ ధాం దోస్తాన్ సాంగ్స్ మాస్ ఆడియాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో నాని ధరణిగా కనిపిస్తుండగా.. ఊర మాస్ లుక్ లో అదరగొట్టాడు. అదిరిపోయే ఫైట్లు పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ అందిరిపోయింది.
నాని కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే విపరీతంగా ప్రమోషన్లు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఆయనతో పాటు మరికొందరు స్టార్ హీరోలను కూడా వెంట తీసుకొస్తూ.. రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా మాస్ మహారాజ రవితేజతో.. నాని తన సినిమా ప్రమోషన్లో పాల్గొన్నాడు.
నిన్ననేమో ఆరడుగుల అందగాడు టాలీవుడ్ స్టార్ హీరో రానాతో నాని రచ్చ చేయగా.. ఈరోజు మాస్ మహారాజా రవితేజతో సందడి చేశాడు. తన మాస్ మసాలా సినిమా కోసం స్టార్ హీరోలను లైన్ లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ముందు ముందు నాని సినిమా కోసం ఎవరెవరు రాబోతున్నారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. మార్చి 30వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













