2.0 ఆడియో పాస్ 60 వేలకు అమ్మడానికి రీజన్స్ ఇవే!

450 కోట్ల బడ్జెట్.కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే వర్క్ అవుట్ అయ్యేంతటి హైబడ్జెట్ తో రోబో కి సీక్వెల్ ని రూపొందిస్తున్నాడు సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్. అయితే ఈ సినిమా ఆడియో ఈవెంట్ ని ఈ నెల 27 న దుబాయ్ లో కనీవినీ ఎరుగని రేంజ్ లో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి పెయిడ్ పాస్ ధర దాదాపు 60 వేలు గా నిర్ణయించి అమ్మకం మొదలుపెట్టగా ఇప్పటికే మొత్తం టికెట్స్ అమ్ముడయిపోయాయి. అయితే ఆ టికెట్ ధర అంత ఉండడం వెనుక ఉన్న కారణాలు తెలుసుకుంటే కళ్ళు తిరుగుతాయి. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ కి హైలైట్స్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఏ సినిమా ఆడియో ఫంక్షన్ కి ఇక్కడినుండి దుబాయ్ కి గెస్ట్ లను తీసుకెళ్లడానికి ఏకంగా చార్టెడ్ ఫ్లైట్స్ ని బుక్ చేశారట. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహ్మాన్ 125 మ్యుజిషియన్స్ తో ఇవ్వబోతున్న లైవ్ పెర్ఫార్మెన్స్ చాలా స్పెషల్ గా నిలవనుంది.

ఇక ఈ వేడుకను అందరూ డిస్ట్రబెన్స్ లేకుండా చూసేందుకు వీలుగా దాదాపు 2 కోట్ల విలువయిన LED స్క్రీన్స్ ని ఏర్పాటుచెయ్యబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి దుబాయ్ కింగ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందంటే అర్ధం చేసుకోవచ్చు ఏ రేంజ్ ప్లానింగ్ జరిగిందో. అసలు అందరూ షాక్ అవుతున్న ఇంకో వియషం ఏంటంటే బుర్జ్ ఖలీఫా పార్క్ లో ఆడియో ఫంక్షన్ చేసుకోవడానికి అనుమతిపొందిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం. అక్కడి గవర్నమెంట్ నిసైతం సైతం కన్వీన్స్ చేశారంటేనే రజిని చరిష్మా, రోబో లో టెక్నీకల్ హైలైట్స్ వేల్యూ ఏంటో అర్ధమవుతుంది.

అయితే ఈ ఆడియో వేడుక కోసం 12,000 ఫ్రీ పాసులు కూడా ఇచ్చారట.అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాట ఉంటుందట.పాటల చిత్రీకరణలో తన ఫ్యూచరిస్టిక్ థాట్స్ ని ప్రెసెంట్ చేసే శంకర్ ఈ పాటని కూడా నెవెర్ బిఫోర్ థెమటిక్ విజన్ తో షూట్ చేయించాడట.ఈ పాటలో కొంత భాగం హైదరాబాద్ లో కూడా షూట్ చేయడం విశేషం.షూటింగ్ గుమ్మడికాయ కొట్టి భారీగా ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.