HomeTelugu Trendingఆర్జీవీ 'కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్'

ఆర్జీవీ ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’

5 8

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్ టైమ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగులు అన్నింటికి బ్రేక్ పడిన వర్మ మాత్రం తనదైన శైలిలో సినిమాలు చేసి విడుదల చేస్తున్నాడు. ఇటీవల క్లైమాక్స్ అనే చిత్రాన్ని తన సొంత ఛానెల్‌లో విడుదల చేయగా, దానికి మంచి స్పందన వచ్చింది.

ఇక ఇటీవలే ‘నేక్డ్’ నగ్నం అనే పోస్టర్‌ని విడుదల చేస్తూ కొత్త సినిమాని మొదలు పెట్టినట్టు తెలియజేశాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ని కూడా రిలీజ్ చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ అనే సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంథించిన లుక్‌ని కూడా విడుదల చేశాడు. ఈ కరోనా సమయంలో వర్మ అంత బాగా ఎవరు వినియోగించుకోలేదు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లో దాదాపు 3 బూతు సినిమాలతో రెచ్చిపోయాడు. ఈయన స్పీడ్‌కి కరోనా కూడా వర్మకి అడ్డుకట్ట వేయలేకపోయిందని అంటున్నారు.

5a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!