HomeTelugu Trending'ఆర్జీవీ సైకో బయోపిక్‌'.. టైటిల్‌కు నో చెప్పిన ఫిలిం చాంబర్‌

‘ఆర్జీవీ సైకో బయోపిక్‌’.. టైటిల్‌కు నో చెప్పిన ఫిలిం చాంబర్‌

13 10
వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌ అనే విషయం మనకి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ మొదలు మొన్న ఏపీ రాజకీయాలను టార్గెట్‌ చేస్తూ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు దాకా అన్ని సినిమాలు పోలిటికల్‌ గా బాగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల సమయంలో వర్మతో రచయిత జొన్నవిత్తులకి సెమీ వార్ జరిగింది. వర్మ సినిమా టైటిల్‌, ప్రమోషన్‌ పద్దతులపై జొన్నవిత్తుల అభ్యంతరం వ్యక్తం చేయటం, తరువాత వర్మ జొన్నవిత్తులపై సెటైర్లు వేయటంతో వివాదం మరింత ముదిరింది.

వర్మ శ్రుతిమించి మాట్లాడడంతో జొన్నవిత్తుల ఏకంగా వర్మ బయోపిక్‌ను తెరకెక్కిస్తానంటూ ప్రకటించి షాక్‌ ఇచ్చాడు. అక్కడితో ఆగక ఆర్జీవీ అనే టైటిల్‌తో సినిమాను రూపొందించేందుకు జొన్నవిత్తుల సిద్ధమయి ఆర్జీవీ సైకో బయోపిక్‌ అనేది ట్యాగ్‌ లైన్‌ తో రిజిస్ట్రేషన్ కి కూడా పంపారు. అయితే ఈ సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్‌ విషయంలో ఆయనకు షాక్ ఇచ్చారు ఫిలిం చాంబర్ వాళ్ళు. సినిమాకు ఆర్జీవీ అనే టైటిల్‌ను పెట్టాలంటే రామ్‌ గోపాల్‌ వర్మ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్ తీసుకురావాల్సిందిగా లేఖ రాశారు. ఇక వర్మ ప్రస్తుతం ఇంటర్‌నేషనల్ లెవల్‌లో తెరకెక్కుతున్న ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!