ఎంగురి డ్యామ్‌లో ‘గ‌రుడువేగ’!

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరో గా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ “పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం” . ప్ర‌స్తుతంజార్జియాలో ఎంగురి డ్యామ్‌లో ఇప్పుడు గ‌రుడ వేగ టీం సంద‌డి చేస్తుంది. జార్జియా దేశానికి మూడొంతులు పైగా ఎల‌క్ట్రిసిటీ, తాగునీటిని స‌రఫ‌రా చేసే డ్యామ్ ఇది. జార్జియా ప‌శ్చిమాన ఉన్న ఈ డ్యామ్ ప్ర‌పంచంలోనే 6వ ఎత్తైన (271.5 మీ లేదా 891 అడుగులు) డ్యామ్. ఈ ప్రాంతంలో ఏడు రోజుల పాటు యాక్ష‌న్ సీక్వెన్స్‌ను చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. పారాచ్యూట్స్‌, మిల‌ట‌రీ విమానాలు, ఎం-16 మెషీన్స్ స‌హా భారీగా పేలుడు ప‌దార్థాల‌ను ఉప‌యోగిస్తున్నారు. జార్జియా అధికారులు, డ్యామ్ అధికారులు యూనిట్‌కు స‌హకారం అందిస్తున్నారు. డ్యామ్ చీఫ్ ఇన్‌చార్జి జాన్ ఛ‌నియా ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తుండ‌టం విశేషం. అంతే కాకుండా 4 డిగ్రీల చ‌లిలో ముప్పై మైళ్ళ వేగంతో గాలులు వీస్తుంది. ఈ ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో కూడా యూనిట్ స‌భ్యులు ఎంతో క‌ష్ట న‌ష్టాల‌కోర్చి సినిమా షూటింగ్ చేస్తున్నారు.